Tirumala Boppidi Famous Venkateshwara swami temple  srinivasa temple

శ్రీమహవిష్ణు స్థితికారకుడు,కలియుగ ప్రవేశానంతరము మహాఋషుల తపో ఫలితంగా బొప్పూడీ పాపనాశన కొండ శిఖరము పైన స్వయంబుగా వెలసినట్లుగా స్థల పురాణం "ఐతీశ్యం" వలన ఆవగతము అవుతుంది.బొప్పున్న అనే పండితుడు ఈ ఆలయ నిర్మాణం గావించినట్లు ప్రకాశం జిల్ల కొరశపాడు రాతిపడగశాసనం వలన తెలుస్తుంది. కరికాళ చోళ వంశోధ్బవుడు బొబ్బులి దేవ మహరాజు, చోళ రాజ్య పరిపాలన చేస్తూ ఈ ఫ్రాంతంలోని స్వామివారిని దర్శించి ఇది మహ పుణ్య స్థలం అని గ్రహించి,పర్వత దిగువన దక్షిణ భాగమున పట్టణము నిర్మించి,ఆ పట్టణమునకు బొబ్బులి దేవపురం నామకరణం చేసి ఇచ్ఛట నుండి రాజ్య పరిపాలన గావించినట్లు "కొండవీటి థండకవిళ" ఆధారముగా తెలుస్తుంది. ఈ పర్వతమునకు ఉత్తర భాగమున హరిహరుల క్షేత్రమును నిర్మించి చెన్నకేశ్వర మల్లేశ్వర స్వామీగా ప్రతిష్టించినారు.

కుమార స్థంభవ క్రుతి పతి చోళరాజు కవిరాజ శిఖామని టెంకన్నాథీత్యుడు తొలి జాను తెలుగు కవి,కాశ్యపు గోత్రుడు అయిన నన్నె చోళ దేవర కవి రాజు. అల్లూరి సీతారామరాజు పిత్యుస్థానమైన ఈ గ్రామంలో బాల్యంలో కొన్ని రొజులు ఈ కొండ గ్రుహంలో "ధ్యానం" చేసినట్లుగా గ్రామస్థుల వలన తెలుస్తుంది. శ్రీ కృష్ణ దేవరాయులు, మంత్రి తిమ్మరుసు, నన్నె చోళుడు, కామ చోళుడు, మరియు మరెందరో చోళ రాజులు, మధుర నాయక రాజుల ప్రధాని దలవాయి మహా మంత్రి బొప్పుడి నరసప్పయ్య, ఆరాద్య సాంప్రదాయ స్థాపకుడు శ్రీ పండిత రాజ్య మల్లికార్జుణుడు, బొప్పుడి పట్టాభి రామన్న, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో ప్రముఖులు స్వామివారిని దర్శించి కుని తన్మయులయ్యారు.

ఈ చుట్టు ప్రక్కల గ్రామాలలో చాలా మంది స్వామివారి సన్నిది లో వివాహం చేసుకోని సుఖ జీవనం సాగిస్తున్నారు. అందువల్లన ఈ స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వరస్వామి అని కూడ పిలుస్తారు. భక్తులు తమ కోర్కెల ను తీర్చుకోనుటకు పరిపరి విధాలు ప్రార్ధిస్తూంటారు. అందులో మచ్చుతునకలు స్వామి వారికి 11 ప్రదక్షణలు చేసి తమ కోర్కెలు ను కొరుకోని, కోర్కెలు తీరిన తరువాత 108 ప్రదక్షణలు చేస్తుంటారు. మరికొంత మంది భక్తులు కొబ్బరికాయ కొట్టి స్వామివారిని కోర్కెలు కోరుకుని వెళుతుంటారు. తమ కోర్కెలు తీరిన తరువాత 108 కొబ్బరికాయల తో స్వామివారి మొక్కు చెల్లించుకుంటారు. స్వామివారికి తలనీలాలు మొక్కులు కూడ ఉన్నాయి.