చరిత్ర

lord balaji temple in
Famous Venkateshwara swami temple in

ఈ స్థలం పూర్వం ధండకారుణ్యంలో అంతర్భాగం త్రేతాయుగంలో వనవాస కాలమందు సీతరాముల కాలములో ఈ కొండ యందు ఉన్న గ్రుహంలో వనవసా నివాసము ఉన్నట్లు స్థల పురాణం వలన తెలుస్తుంది. ఆ ప్రాంతం లోని సీతమ్మ వారి పాద ముద్రికలు,వారు నివసించిన గ్రుహ నేటికి భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఎంతో మంది మహర్షులు తపస్సు చేసి శ్రీవారి దర్శనం పొంది, కైవల్యం పొందినట్లుగా 1797 సం.లో సర్వే ఆఫ్ ఇండియా లార్డ్ మెకంజీ వారి వ్రాత ఫ్రుతుల వలన తెలుస్తుంది.( volume 50,page 65/-to 654 ).

19 వ శతాబ్ధం వరకు ఈ పర్వతము మీద రహస్య ప్రదేశములయందు తపోనిష్ట తో చాల మంది రుషులు చీకటిలో జీవిస్తూ స్వామి వారిని తలుచుకుంటూ తపస్సు చేసుకోని స్వామి వారి దర్శనం పొంది ఉన్నారు. కనుక ఈ స్థలం ఒక పుణ్య స్థలంగా భావిస్తారు. కలియుగం ప్రవేశించిన తరువాత కరికాళ చోళ రాజు అయిన బచ్చిదేవ మహరాజు ప్రతిభావంతుడై పరిపాలన చేస్తూ ఈ స్థలాన్ని చూసి ఇది బహుదివ్యమైన స్థలము అని పరిగణించి రాజ్యంలోకి తీసుకుని దానిని , ఒక గొప్ప పట్టణంగా నిర్మించారు. బొప్పన్న అనే పండితుడు ఈ స్వామివారికి మొట్ట మొదట గా దేవాలయం కట్టించినందు వలన అతని పేరు మీదనే ఈ గ్రామం బొప్పుడి గ్రామము గా పిలవబడుతున్నది.

2015 విజయదశమికి Dr.B.N రమేష్ I.P.S గారు ఈ దేవాలయ దర్మకర్త భాధ్యతలు స్వీకరించిన తదుపరి మొట్టమొదటగా 17th march 2016 నాడు రాతి ధ్వజస్థంభ ప్రతిష్ట గావించి ఈ ప్రాంతమును బొప్పుడి తిరుమల గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

తరువాయి పేజ్